తిరుమల తరహాలో ఇతర ఆలయాలలో అన్నప్రసాదాలు పంపిణీ
TPT: తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదాలను అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో, అన్నప్రసాదాల తయారీ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, పంపిణీని పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.