'అవసరాల మేరకు యూరియా సరఫరా అవుతుంది'

ELR: జిల్లాలో యూరియాను నిరంతరం రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం సరఫరా చేస్తుందనే విషయాన్నీ క్షేత్రస్థాయిలో రైతులకు స్పష్టంగా అవగాహన కలిగించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై వ్యవసాయాధికారులతో గురువారం కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.