VIDEO: మాజీ ఎమ్మెల్యే దివంగత సాయన్న భార్య కన్నుమూత
HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, దివంగత సాయన్న భార్య గీత (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. గతేడాది సాయన్న, ఈ ఏడాది వారి కుమార్తె (ఎమ్మెల్యే) లాస్య నందిత మరణించగా.. ఇప్పుడు గీత మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.