పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మిక తనిఖీ
విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదివారం పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, కేసుల రికార్డులు, స్టేషన్ నిర్వహణను సమీక్షించారు. మరుగుదొడ్ల శుభ్రత, పరిసరాల పరిస్థితిని పరిశీలించి, మెరుగుదలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.