సైబర్ నేరలపై అవగాహన కార్యక్రమం
ప్రకాశం: ముండ్లమూరు మండలంలో ఆదివారం పోలీసులు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వాహనాలు నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు. కొత్త వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటిపి నంబర్లు అడిగితే చెప్పవద్దని సూచించారు