ఛార్జింగ్ కేంద్రంలో AI కెమెరాలు
HYD: విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల్లో కేబుళ్ల దొంగతనాలు అధికారులను కలవరపెడుతున్నాయి. ఈ ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటంలో GHMC అప్రమత్తమైంది. ఇకపై చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ GHMC నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్లలో ఫిర్యాదు చేసింది. ప్రతి ఛార్జింగ్ కేంద్రం వద్ద AI కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటరుకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు.