అన్న క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

అన్న క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

VZM: విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు నగరపాలక సంస్థ కార్యాలయం జంక్షన్‌లోని అన్న క్యాంటీన్‌ను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మీడియా కో ఆర్డినేటర్ పడాల జోగేష్ పాల్గొన్నారు.