కాగజ్ నగర్ DSPగా ఎండీ వహీఉద్దీన్ బాధ్యతల స్వీకరణ

ASF: కాగజ్ నగర్ DSPగా ఎండీ వహీఉద్దీన్ పట్టణంలోని తన కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కాగజ్ నగర్‌కు వచ్చారు. ఆంతకుముందు ఇక్కడ డీఎస్పీగా ఉన్న రామా నుజం ఏఎస్పీగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వహీఉద్దీన్ పేర్కొన్నారు.