VIDEO: ఘనంగా కోదండ రాముని ప్రతిష్టా వేడుకలు

VIDEO:  ఘనంగా కోదండ రాముని ప్రతిష్టా వేడుకలు

కోనసీమ: అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామంలోని తోటాలమ్మ చెరువుగట్టు వద్ద శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఇవాళ రెండో రోజుకు చేరుకున్నాయి. వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక హోమాలు, యంత్ర ప్రతిష్ట, శిలా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.