వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహాన సదస్సు
ELR: వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.నిర్మల కుమారి అన్నారు. గణపవరం ZP గర్ల్స్ హై స్కూల్లో మంగళవారం వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అవగాహన కల్పించారు.