'సబ్సిడీ బర్రెల యూనిట్లుకు దరఖాస్తు చేసుకోవాలి'

'సబ్సిడీ బర్రెల యూనిట్లుకు దరఖాస్తు చేసుకోవాలి'

PDPL: ధర్మారం మండలంలోని ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై 150 బర్రెల యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని ఇన్చార్జ్ MPDO శ్రీనివాస్ తెలిపారు. యూనిట్ (2 బర్రెలు) విలువ రూ.2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 25 లోపు MPDO కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. కులం, ఆదాయం, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం జతపరచాలన్నారు.