ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన శిబిరాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన శిబిరాలు

MNCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసంక్రమణ వ్యాధులు, షుగర్ వ్యాధిపై అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. అనిత తెలిపారు. బుధవారం పాత మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈనెల 15వ వరకు వైద్య పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు.