VIDEO: అక్రమ నిర్మాణంపై చర్య.. పబ్ సీజ్
VSP: నగరంలోని తిమ్మాపురం బీచ్ రోడ్డులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న విరాగో పబ్‌పై జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ నిర్వహించిన మెరుపు తనిఖీలలో నిర్మాణానికి సరైన అనుమతులు లేవని గుర్తించి పబ్‌ను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు.