ఉద్యోగాలకు డబ్బులిచ్చి మోసపోకండి: ఎస్పీ హెచ్చరిక

ఉద్యోగాలకు డబ్బులిచ్చి మోసపోకండి: ఎస్పీ హెచ్చరిక

KRNL: ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తాయని, డబ్బులు ఇచ్చి మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, ఇలాంటి వలలో పడి బాధితులు ప్రజాఫిర్యాదుల వేదికకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డబ్బుల కోసం ఆశ చూపే దళారులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.