మే 4 నుంచి నాయుడుపేట పోలేరమ్మ జాతర

మే 4 నుంచి నాయుడుపేట పోలేరమ్మ జాతర

TPT: నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ తల్లి జాతర మే నెల 4 నుంచి 7వ తేది వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. జాతరలో భాగంగా 4, 5వ తేదిలలో ఘటోస్థవం, 6వ తేది గ్రామోత్సవం, 7వ తేది అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలని పూజారులు సూచించారు.