మానవ సేవే మాధవ సేవగా అభాగ్యులకు అన్నదానం

మానవ సేవే మాధవ సేవగా అభాగ్యులకు అన్నదానం

KMM: మధిర మండల పరిధిలోని మడుపల్లి గ్రామంలో గల శ్రీ విజయ గణపతి దేవాలయ కమిటీ సభ్యులు బుధవారం పలువురు దాతల సహాయ సహకారాలతో మానవ సేవే మాధవ సేవగా స్థానిక అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ,అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.