సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్

కృష్ణా: అవినిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ వెంకటరెడ్డి రూ.1.58కోట్లు దారి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పదవి విరమణ చేసిన ఉద్యోగుల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించారు. గత శనివారం జిల్లా ట్రెజరీ అధికారి రవి కుమార్ ఫిర్యాదు చేశారు. DSP విద్యశ్రీ ఆధ్వర్యంలో వెంకటరెడ్డిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు.