చేపల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

చేపల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలో మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించి చేప పిల్లలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం అద్భుత ఫలితాలను సాధిస్తున్నదని అన్నారు. ప్రతి గ్రామంలోని చెరువులో మత్స్య సంపద పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని తెలిపారు. బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు.