ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన
ఢిల్లీ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనదిగా అభివర్ణించింది. ఇది ఇలాగే కొనసాగితే మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా న్యాయవాదులను వర్చువల్‌గా విచారణకు హాజరు కావాలని సూచించింది. వర్చువల్ అవకాశం ఉన్న ఎందుకు భౌతికంగా కోర్టు కార్యకలాపాలకు హాజరవుతున్నారని ప్రశ్నించింది.