'రేషన్ డీలర్ల బకాయి విడుదల చేయాలి '

'రేషన్ డీలర్ల బకాయి విడుదల చేయాలి '

WGL: నల్లబెల్లి రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షుడు చెట్టుపల్లి దామోదర్ విలేకర్లతో మాట్లాడుతూ.. గత ఆరు నెలల నుంచి రేషన్ డీలర్లకు రావాల్సిన కమిషన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రేషన్ డీలర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.