హిట్ మ్యాన్‌పై కైఫ్ ప్రశంసల వర్షం
రోహిత్ శర్మ నం.1 ODI బ్యాటర్‌గా నిలిచిన నేపథ్యంలో మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘బ్యాటర్‌గా టాప్‌లో నిలవాలని రోహిత్ ఎప్పుడూ అనుకోలేదు. అదే అతణ్ని వచ్చి చేరింది. ODIల్లో 4, T20ల్లో 2 స్థానాల్లో ఉన్న INDను రోహిత్ అగ్రస్థానంలో నిలిపాడు’ అని కొనియాడాడు. అందుకే అతణ్ని గొప్ప కెప్టెన్‌గా పరిగణిస్తారని పేర్కొన్నాడు.