ఆదివాసి నాయకులు ఆందోళన

ఆదివాసి నాయకులు ఆందోళన

ASF: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్‌ను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని తుడుందెబ్బ డివిజన్ అధ్యక్షులు గేడం సుభాష్ తెలిపారు. ఆసిఫాబాద్ లోని కొమురం భీం చౌరస్తాలో వారు ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కోవ విజయ్ కుమార్‌ను భేషరతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో ఆదివాసీలతో కలిసి జైనూర్ మండలంలో భారీ ర్యాలీ చేపడతామని హెచ్చరించారు.