వెలిగిపోతున్న మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం

NLR: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం విద్యుత్ వెలుగులతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. ఆగస్టు 15న జెండా ఆవిష్కరణను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్యాలయ భవనం చుట్టూ మూడు రంగుల విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ అలంకరణలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.