సినిమా హాల్‌ను పరిశీలించిన జేసీ

సినిమా హాల్‌ను పరిశీలించిన జేసీ

W.G: మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్‌ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.