విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవాలు
BDK: అశ్వాపురం PMSHRI జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్‌లో భాగంగా శుక్రవారం అగ్రికల్చర్ యూనివర్సిటీ, పామాయిల్ ఫ్యాక్టరీ, నర్సరీ, రుద్రంపూర్ చిల్డ్రన్స్ పార్క్‌లను సందర్శించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నందు వివిధ రకాల మొక్కల రకాలు, వాటి పెరుగుదల, కూరగాయలకు సంబంధించిన తోటలను, పుష్పాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.