జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే..!

ADB: జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్ష పాతం నమోదు వివరాలను అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 8:30 నుంచి 11గంటలకు వరకు తాంసి మండలంలో అత్యదిక వర్ష పాతం నమోదు అయిందని TGBS అధికారులు పేర్కొన్నారు. తాంసి 142.0 మిల్లీ మీటర్లు, తలమడుగు 140.3, సిరికొండ 135.0 గుడిహత్నూర్ 133.3, రాంనగర్ 129.0, సాత్నాల 125.5, హీరపూర్ 122.2, ఇచ్చోడ 114.3 మిల్లీ మీటర్ల వర్షా పాతం నమోదైనట్లు తెలిపారు.