ముంపు సమస్య నుంచి కాపాడండి: రైతులు

ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట నుంచి బాదంపూడి వరకు ఉన్న క్వారీ మురుగు బోదులో తూడు, గుర్రపు డెక్కతో నిండిపోయి ఉంది. దీని వలన నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడంతో పంట పొలాలు మునిగిపోతున్నాయి. బోదేలో ఉన్న గుర్రపు డెక్కలను, తూడులను తొలగించి పంట పొలాల ముంపునకు గురికాకుండా చూడాలని రైతులు, కౌలు రైతులు అధికారులను కోరుతున్నారు.