VIDEO: వైరాలో దంచికొట్టిన వర్షం
KMM: వైరా మండలంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మొన్నటివరకు తుఫానుతో నష్టపోయిన రైతన్నలకు ఈ వర్షం మరో ఆటంకంగా మారింది. చేతికొచ్చిన వరి, పత్తి పంటలు దెబ్బతింటుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, ఉదయం నుంచి ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది.