VIDEO: పాఠశాలలో బాలిక మృతి.. CC TV దృశ్యాలు
కోనసీమ: రాయవరం మండలం పసలపూడి బండిరేవుగట్టు కాలనీకి చెందిన నల్లమిల్లి సిరి అనే పదవ తరగతి విద్యార్థిని శనివారం రామచంద్రపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పాఠం వింటుండగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.