'దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలి'
VZM: కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకి సీపీఐ సంపూర్ణ మద్దతనిస్తుందని నెల్లిమర్ల మండల కార్యదర్శి మొయిద పాపారావు కోరారు. కొండగుంపాంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ, ఆర్థిక విధానాలు ప్రారంభమైన దగ్గర నుండి దేశంలో కార్మిక వర్గ హక్కులపై దాడి తీవ్రతరమైందన్నారు.