ద్వితీయ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసిన వీసీ
NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగిన పీజీ (ఎం.ఏ/ఎమ్మెస్సీ/ఎం.కామ్) ద్వితీయ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఉపకులపతి (వీసీ) ప్రొఫెసర్ టీ. యాదగిరి రావు మంగళవారం విడుదల చేశారు. రిజిస్ట్రార్ ప్రొ. ఎం. యాదగిరి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ.కే. సంపత్ కుమార్‌లతో కలిసి వీసీ ఫలితాలను విడుదల చేశారు.