ఈనెల 10న మెగా జాబ్ మేళా

ఈనెల 10న మెగా జాబ్ మేళా

ADB: ఆదిలాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో మార్చి 10న ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 50కి పైగా కంపెనీలు పాల్గొని సుమారు 2000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 7వ తరగతి నుంచి ఉన్నత చదువులు చదివిన వారు అర్హులని, ఎంపికైన వారికి రూ. 13,000 నుంచి రూ.40,000 వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు.