VIDEO: అపరిశుభ్రంగా ఉన్న తాహశీల్దార్ కార్యాలయం

ప్రకాశం: పొన్నలూరు తాహశీల్దార్ కార్యాలయ ఆవరణం అపరిశుభ్రానికి నిలయంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రిపూట ఆకతాయిలు మద్యం సేవించి మద్యం సీసాలు, మంచినీటి బాటిళ్లు అక్కడే పడేస్తున్నారని తెలిపారు. దీంతో పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అసౌకర్యానికి లోనవుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి కార్యాలయం ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.