'కళాశాల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలి'
KDP: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. నారాయణ, జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సోమవారం కడప కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యారంగం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించడం, ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు.