మంగళగిరిలో తాగునీటి సరఫరాకు అంతరాయం

మంగళగిరిలో తాగునీటి సరఫరాకు అంతరాయం

GNTR: మంగళగిరిలోని పలు ప్రాంతాల్లో గురువారం తాగునీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని MTMC కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు. ప్రధాన పైప్ లైన్లో లీకేజీ కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. పాత మంగళగిరి, హుస్సేన్ కట్ట, రత్నాల చెరువు, లక్ష్మీనరసింహ కాలనీ, హరిజనవాడ, ఎన్ సీసీ రోడ్డు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా అవుతుందని చెప్పారు.