కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు పోలీసుల విజ్ఞప్తి
BDK: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం గుడికి వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని టూ టౌన్ సీఐ ప్రతాప్ భక్తులకు ఇవాళ పలు సూచనలు చేశారు. భక్త జనసమూహం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున గుడికి వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండాలని సూచించారు. ఆభరణాలు ధరించి వెళ్ళడం వలన దొంగతనం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.