19న జీజీహెచ్లో గుండె వైద్యశిబిరం
NZB: ఆర్బీఎస్కే, అపోలో హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19న పిల్లలకు గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. నవజాత శిశువు నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.