సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి

HYD: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తున్నామని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మంగళవారం ఎంఐఎం కార్యాలయంలో ఎంపీని పలు ప్రాంతాల ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీకి వినతి పత్రాలను అందజేశారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.