ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్..!

ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్..!

KDP: పెద్దముడియం(M)లోని గ్రామీణ పొలాల్లో ట్రాన్స్ ఫార్మర్లను పగులకొట్టి కాపర్ వైర్లు దొంగిలిస్తున్న కేసులో ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. AE ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, వాహనాల తనిఖీలో బోయ ప్రశాంత్ (30), క్రాంతికుమార్ (26)లను పట్టుకున్నారు. 40 కిలోల రాగి వైర్లు కారు స్వాధీనం చేసుకున్నట్లు CI భాస్కర్ రెడ్డి తెలిపారు.