తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని తీర్మానం

తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని తీర్మానం

CTR: నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని అఖిల పక్ష సమావేశంలో నాయకులు తీర్మానించారు. నగరిలో రాజకీయ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ మూడు మండలాలను తిరుపతిలో కలుపుతామని గతంలో చంద్రబాబు బహిరంగంగా హామీ ఇచ్చారని వారు చెప్పారు. తిరుపతి దగ్గరగా ఉండడంతో అందులో కలిపితే అన్నింటికీ సౌలభ్యంగా ఉంటుందన్నారు.