రామతీర్థంలో 186 మందితో పోలీసు బందోబస్తు'
VZM: రామతీర్థం శివరాత్రి జాతర సందర్భంగా 15, 16 తేదీల్లో మొత్తం 186 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నట్లు భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఎస్‌డీపీవో పర్యవేక్షణలో ఐదుగురు సీఐలు, 24 మంది ఎస్సైలు, 12 మంది ఏఎస్సైలు, 150 మంది కానిస్టేబుళ్లు,హోమ్‌గార్డులు విధుల్లో పాల్గొని రెండు రోజుల పాటు భద్రత కొనసాగిస్తారని చెప్పారు.