VIDEO: సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్
NZB: మోస్రా మండల కేంద్రంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఇవాళ రెండు ఇళ్ల మధ్య గొడవ జరిగడంతో మనస్తాపం చెందినట్లు తెలిపారు. దీంతో తన తండ్రి మందలించాడని యువకుడు సెల్ టవర్ ఎక్కి చస్తామని బెదిరించాడు. అతని తండ్రి బతిమిలాడి కిందికి దింపడంతో అంత ఊపిరి పిల్చుకున్నారు.