VIDEO: ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి సూసైడ్
TG: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల దాబా వద్ద ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతుడు ముద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. అయితే, బాలరాజు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.