చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్
NRML: జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీలలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రధాన కూడళ్ళు, జన సంచార ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఇవాళ ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు.