VIDEO: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: చినరాజప్ప
కోనసీమ: అన్నదాత సుఖీభవ పథకంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం ఉదయం అమలాపురం మండలం రంగాపురంలో జరిగిన మృత్యుంజయ హోమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.