వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

ELR: ఏలూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు వాహన తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. వాహనాలకు సరైన ధ్రువీకరణ పత్రాలు, హెల్మెట్లు వినియోగించిన వారికి అపరాధ రుసుములను విధించారు. ఈ సందర్భంగా ఎస్సై అప్పారావు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి నియమ నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.