మోడల్ స్కూల్‌లో అవకతవకలు, సస్పెండ్‌కు డిమాండ్
KRNL: గోనెగండ్ల మండలం ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రవేశాల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ఆర్ఏయూఎస్ఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రఘునాథ్, ఆఫ్రిది బుధవారం డిమాండ్ చేశారు. ప్రవేశాల్లో ముడుపులు, ఫుడ్ పాయిజన్ ఘటనను గోప్యంగా ఉంచిన విషయాలపై ఎంఈఓలకు వినతిపత్రం ఇచ్చారు. న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.