VIDEO: పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన

VIDEO: పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన

KDP: కాసినాయన మండలం గంగన్నపల్లె సమీపంలో పెట్రోల్ దాడికి గురైన యువకుడు తిరుపతి సిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును తప్పుదారి పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ముందు కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.