పాఠశాల బస్సులపై ఆర్టీఏ దాడులు

పాఠశాల బస్సులపై ఆర్టీఏ దాడులు

గద్వాల: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులపై సోమవారం ఆర్టీఏ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న బస్సులను గుర్తించి, 21 కేసులు నమోదు చేశారు. పాఠశాల బస్సులు ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్ చేయించుకోవాలని, రవాణా శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.