వైభవంగా పోతురాజు సిరిబొమ్మ ఉత్సవం

వైభవంగా పోతురాజు సిరిబొమ్మ ఉత్సవం

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో శుక్రవారం పోతురాజు ఊరేగింపుతో మంగళవాయిద్యాలు మార్మోగాయి. సంప్రదాయ దుస్తుల్లో గ్రామస్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని పండుగకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. సాయంత్రం సిరిబొమ్మను ఉత్సవంలో ఉయ్యాల ఊపుతూ పండ్లతో అలంకరించిన బొమ్మను కొట్టే ఆచారం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.